
ఒక్కసారి నోరు జారితే అంతే సంగతులు.. సరదాగా అన్నా, సీరియస్‌గా అన్నా ఆ మాటలను వెనక్కు తీసుకోలేరు. కొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడే పదాలే పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీకి ఇలాగే జరిగింది. 2014లో ఇతడు కాఫీ విత్ కరణ్ షోకి వెళ్లాడు. అక్కడ ర్యాపిడ్ ఫైర్ సెషన్‌లో భాగంగా యాంకర్ ప్లాస్టిక్ అన్న పదం ప్రస్తావించగానే ఇమ్రాన్ ఐశ్వర్యరాయ్ పేరు చెప్పాడు.
అందరూ షాక్
ఇంకేముంది.. ఐశ్వర్య అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది. మా హీరోయిన్ నీ కంటికి ప్లాస్టిక్‌లా కనిపిస్తోందా? అని చెడుగుడు ఆడుకున్నారు. నిజానికి తను ఐశ్వర్య పేరు చెప్పగానే లొకేషన్‌లో ఉన్నవారంతా షాకయ్యారట! ఈ ఆన్సర్ ఉంచుదామా? తీసేద్దామా? అని అడిగితే సెట్‌లో ఉన్నవాళ్లు అలాగే ఉండనీయమని చెప్పారని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు ఇమ్రాన్. దాని వల్ల ఎదురైన పరిణామాలను(ట్రోలింగ్‌ను) చాలాకాలం పాటు భరించాల్సి వచ్చిందన్నాడు.
అదొక గేమ్.. తప్పుగా అనుకోవద్దు
ఈ విషయం గురించి గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఐశ్వర్యరాయ్‌కు పెద్ద అభిమానిని. నేను తప్పు ఉద్దేశంతో అనలేదు. నేను ఆమెను ఎంతగానో అభిమానిస్తాను. షోలో యాంకర్ ఒక వస్తువు పేరు చెప్పగానే నన్ను ఎవరో ఒక సెలబ్రిటీల పేర్లు చెప్పమన్నారు. అందుకే ఆమె పేరు చెప్పానే తప్పితే అంతకు మించి ఏ ఉద్దేశమూ లేదు. దీన్ని అనవసంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని వివరణ ఇచ్చాడు ఇమ్రాన్ హష్మీ.
చదవండి: దేవిశ్రీప్రసాద్ ఇంట పండగ వాతావరణం.. తండ్రయిన సింగర్ సాగర్
Comments
Please login to add a commentAdd a comment