
నిర్మాతగా మారుతున్న మరో స్టార్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్స్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సీరియల్ కిస్సర్, ఇటీవల ప్రయోగాలకు సై అంటున్నాడు. ప్రస్తుతం అజయ్ దేవగన్ నిర్మిస్తున్న బాద్షాహో చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్, ఆ సినిమా తరువాత తన సొంతం నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న సినిమా పనులు మొదలెట్టనున్నాడు. తన నిర్మాణ సంస్ధ తొలి ప్రాజెక్ట్ను ట్విట్టర్లో ప్రకటించాడు ఈ బాలీవుడ్ హీరో.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశాడు. కెప్టెన్ నవాబ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టూ కంట్రీస్ వన్ సోల్జర్(రెండు దేశాలు. ఒక సైనికుడు) అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. పోస్టర్లో ఇమ్రాన్ లుక్ను కూడా ఆసక్తికరంగా డిజైన్ చేశారు. పాకిస్థాన్, భారత్లకు సంబందించిన ఆర్మీ యూనిఫాంలను ధరించిన ఇమ్రాన్, ఏ దేశానికి సంబందించిన సైనికుడు అర్ధం కాకుండా కన్య్ఫూజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబందించిన వివరాలేవి యూనిట్ సభ్యులు వెల్లడించటం లేదు.
And here it is, my first home production movie !!... pic.twitter.com/LGm8YZgaii
— emraan hashmi (@emraanhashmi) 26 August 2016