
అజార్ కు ఇమ్రాన్ హష్మి స్పెషల్ గిఫ్ట్
బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి.. భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మరపురాని పుట్టినరోజు కానుకను అందించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తున్న ఇమ్రాన్.. సోమవారం 53వ పడిలో అడుగుపెట్టిన అజారుద్దీన్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ఓ స్పెషల్ ఫొటోను పోస్ట్ చేశారు.
ఆ ఫొటోలో తెలుపు రంగు టెస్ట్ టీమ్ జెర్సీని ధరించి కనబడుతున్న ఇమ్రాన్.. వయస్సులో ఉన్నప్పటి అజహర్ను ప్రతిబింబిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఇమ్రాన్ క్రికెట్లో మెళకువలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా అజారుద్దీన్ బ్యాటింగ్ శైలి బాగా ప్రాక్టీస్ చేశాడు. ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ మాట్లాడుతూ.. ఈ సినిమా నటుడిగా ఇమ్రాన్ను మరోసారి తనను తాను కనుగొనేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేసవిలో విడుదల కానుంది.
Happy 53rd Birthday @mpazhar. Here is my birthday present.Me as You in #Azhar! #HappyBirthdayAzhar @AzharTheFilm pic.twitter.com/0LWBie2GmT
— emraan hashmi (@emraanhashmi) February 8, 2016