అధరామృత దీపిక
పెదవి ముద్దు కోసం కథానాయకుడు చొరవ చూపిస్తాడు. కథానాయిక సిగ్గు పడుతుంది. కొంచెం కష్టమైనా ఇద్దరూ ఆ సీన్‌ని ఎలాగోలా పండించేస్తారు. ఇది మొన్నటిదాకా తెరపై జరిగిన కథ. ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. కథానాయికే ముందు చొరవ చూపిస్తుంటే.. కథానాయకుడు సిగ్గు పడాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ అనూహ్యమైన మార్పుకి కారణం ‘దీపికా పదుకొనే’ అని ముక్తకంఠంతో అంటోంది బాలీవుడ్. ఆమెను ‘లేడీ ఇమ్రాన్ హష్మీ’గా అభివర్ణిస్తున్నవారు అక్కడ కోకొల్లలు. తాను నటించిన ఒకటి రెండు సినిమాలను మినహాయిస్తే... మిగిలిన అన్నింటిలోనూ హీరోలకు తన అధరామృతాన్ని అందించిన ఘనత దీపిక పదుకొనేది.
‘బెస్ట్ లిప్‌లాకర్’ అనే అవార్డు ఏర్పాటు చేస్తే ప్రతి ఏడాదీ ఆ పురస్కారం దీపికానే వరిస్తుందని అక్కడ చాలామంది అభిప్రాయం. అందుకేనేమో... దీపికాతో ‘కాక్‌టైల్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హోమీ ఆడ్జానియా ఆమెతోనే మరో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. సినిమా పేరు ‘లిప్‌లాక్’. టైటిల్‌ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీపిక కూడా ఈ సినిమాకు పచ్చజెండా ఊపేసిందట. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. ‘కాక్‌టైల్’ సినిమాలో దీపికాను టూపీస్ బికినీలో చూపించి పెను సంచలనానికే తెరలేపిన హోమీ ఆడ్జానియా... ఈ రీసెంట్ ‘లిప్‌లాక్’తో ఇంకెంత సెన్సేషన్ సృష్టిస్తాడో చూడాలి.