
ముంబైలో జాన్ అబ్రహమ్ డాన్‌గా మారి ఒక రాజకీయ నాయకుడి తమ్ముణ్ణి చంపేశాడు. ఇప్పుడు అతని తలమీద పదికోట్ల బహిరంగ విలువ నిర్థారించబడింది. ఎవరు ఆ తలను తెస్తే వారికి పది కోట్లు. ఇన్‌స్పెక్టర్ ఇమ్రాన్ హష్మీ రంగంలోకి దిగాడు. ఈ తాజా మాస్ మసాలా సినిమా మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ‘కాంటె’, ‘జిందా’, ‘షూట్ అవుట్ ఎట్ వడాలా’ వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు సంజయ్‌గుప్తా దీని నిర్మాత, దర్శకుడు.
జాన్ అబ్రహమ్, ఇమ్రాన్ హష్మీ, సునీల్ శెట్టి ప్రధాన తారాగణం. మన కాజల్ అగర్వాల్ మరో ముఖ్యపాత్రలో కనిపిస్తుంది. ఎనభైలలో జరిగిన ఈ కథను నాటి బాంబే గూండాయిజాన్ని ఈ సినిమాలో కథాంశంగా తీసుకున్నారు. గూండా మామూళ్లను ఎదిరించి గూండాగా మారిన పాత్రలో జాన్ అబ్రహమ్ కనిపిస్తాడు. ‘పిస్తోలు ఊరికే ఫ్యాషన్ కు పెట్టుకుంటాను. భయపెట్టడానికి నా పేరు చాలు’ వంటి పంచ్ డైలాగులు ఉన్నాయి. చూడాలి ప్రేక్షకులు ఏం తీర్పు చెబుతారో.