కొడుకు బాధ చూసి.. పుస్తకం రాస్తున్న హీరో | Emraan Hashmi penning book on his son's struggle with cancer | Sakshi
Sakshi News home page

కొడుకు బాధ చూసి.. పుస్తకం రాస్తున్న హీరో

Published Fri, Oct 16 2015 4:27 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

కొడుకు బాధ చూసి.. పుస్తకం రాస్తున్న హీరో

కొడుకు బాధ చూసి.. పుస్తకం రాస్తున్న హీరో

ముంబై: బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ రచయితగా మారారు. కేన్సర్తో బాధపడుతున్న కొడుకు ఆర్యన్ (5) చూసి చలించిపోయిన ఇమ్రాన్ ఓ పుస్తకం రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ పుస్తకంలో కేన్సర్పై పోరాటం గురించి రాయనున్నారు. 36 ఏళ్ల ఇమ్రాన్ తొమ్మిదేళ్ల క్రితం పర్వీన్ షహానీని వివాహం చేసుకున్నారు. కాగా వీరి ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్ కేన్సర్ బారినపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాధి తొలి దశలో ఉంది. ఆర్యన్ చికిత్స పొందుతున్నాడు.

'నా జీవితంలో గత రెండేళ్లుగా కష్టాలు చవిచూస్తున్నా. ఇద్దరు గొప్ప గురువులను గుర్తించా. వారిద్దరూ కేన్సర్, నా కొడుకు. నాకెదురయిన అనుభవాలపై ఓ పుస్తకం రాయబోతున్నా' అని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ఈ పుస్తకం విడుదల కావచ్చని భావిస్తున్నారు. పెంగ్విన్ బుక్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. ఇదిలావుండగా ఇమ్రాన్.. టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిసున్న చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement