కుమారుడి క్యాన్సర్ చికిత్స కోసం విదేశాలకు ఇమ్రాన్!
కుమారుడి క్యాన్సర్ చికిత్స కోసం విదేశాలకు ఇమ్రాన్!
Published Sun, Jan 19 2014 6:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
నాలుగేళ్ల తన కుమారుడి చికిత్స కోసం బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విదేశాలకు వెళ్లనున్నారు. ఇమ్రాన్ హష్మీ కుమారుడు ఆయన్ కు క్యాన్సర్ వ్యాధి సోకినట్లు ఇటీవలే వైద్యులు గుర్తించారు. అయితే తొలి దశలోనే ఉందని వైద్యులు నిర్ధారించారు. ఇమ్రాన్ హష్మీ కుమారుడికి విదేశాల్లో కెమోథెరఫీ చికిత్స నిర్వహించాలని వైద్యులు సూచించారు.
జనవరి 15 తేదిన ఆయన్ కు సర్జరీ చేసి కిడ్నీ నుంచి ట్యూమర్ ను వ్యైద్యులు విజయవంతంగా తొలగించారు. మంగళవారం ఆయన్ ను ఆస్పత్రి నుంచి విడుదల చేయనున్నారు. ఇటీవల క్రికెటర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ వ్యాధికి గురవ్వడంతో అమెరికాలో కెమోథెరపీ చికిత్స నిర్వహించారు. ఆయన్ కు అమెరికాలో కెమోథెరఫి నిర్వహించాలని ఇమ్రాన్ కు యువరాజ్ సింగ్ సూచించినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement