విలక్షణ పాత్రలో యువ హీరో! | goodachari first look on sankranthi | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 11 2018 7:04 PM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

goodachari first look  on sankranthi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విలక్షణ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్‌. ‘క్షణం’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న ఈ నటుడు మరో విలక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అడవి శేష్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గూఢచారి’ .. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయబోతున్నారు.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి అయిన తెలుగమ్మాయి శోభితా దూళిపాల టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. విచిత్రంగా ఈ సినిమాను ఇద్దరు దర్శకులు కలిసి తెరకెక్కిస్తున్నారు. అభిషేక్‌ ప్రొడక్షన్‌లో ఈ సినిమా రూపొందుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement