మెగా హీరోతో రిలేషన్‌లో రీతూ వర్మ.. క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్‌ తేజ్‌! | Vaishnav Tej Gives Clarity on Rumours about Ritu Varma | Sakshi

Vaishnav Tej: మెగా హీరోతో టాలీవుడ్‌ హీరోయిన్‌ రిలేషన్‌? వైష్ణవ్‌ తేజ్‌ ఏమన్నాడంటే?

Nov 18 2023 6:25 PM | Updated on Nov 18 2023 6:47 PM

Vaishnav Tej Gives Clarity on Rumours about Ritu Varma - Sakshi

ఆ మధ్య వరుణ్‌-లావణ్యల పెళ్లికి అల్లు అర్జున్‌ ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్‌ హీరోయిన్‌ రీతూ వర్మ కూడా ఉంది. దీంతో ఆమె మెగా హీరోతో రిలేషన్‌లో ఉందని వార్త

మెగా ఫ్యామిలీ ఇంట ఏ సెలబ్రేషన్స్‌ జరిగినా అక్కడ వాలిపోయేది హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి. నిహారిక స్నేహితురాలిగా తరచూ వారి ఇంటి వేడుకల్లో కనిపించేది. కానీ జనాలు మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ జరుగుతోందని అనుమానపడ్డారు. అన్నట్లుగా వరుణ్‌-లావణ్య షికార్లకు వెళ్లడం, వీరిద్దరి మధ్య లవ్వాయణం నడుస్తోందని ప్రచారం జరగడం.. చివరకు అదే నిజమంటూ పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయింది.

అయితే ఆ మధ్య వరుణ్‌-లావణ్యల పెళ్లికి అల్లు అర్జున్‌ ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో టాలీవుడ్‌ హీరోయిన్‌ రీతూ వర్మ కూడా ఉంది. దీంతో ఆమె మెగా హీరోతో రిలేషన్‌లో ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవ్‌ తేజ్‌ ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. రీతూ వర్మ.. లావణ్య స్నేహితురాలు.. అందుకనే పార్టీకి వచ్చింది. పెళ్లి వేడుకల్లోనూ సందడి చేసింది. అంతకుమించి ఏమీ లేదు అని చెప్పుకొచ్చాడు వైష్ణవ్‌ తేజ్‌.

కాగా మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ఆదికేశవ. శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నవంబర్‌ 10న విడుదల కావాల్సింది. కానీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ప్రభావం సినిమాలపై పడుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. 

చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టార్‌ డైరెక్టర్‌ కూతురు? వైద్య వృత్తిలోకి ఎంటర్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement