
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా.. నీలి మబ్బుల్లో నేనే తేలేతంలా’ అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ పాటను ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment