
‘గూఢచారి’ ఆఫర్ వదులుకున్న హీరోయిన్
హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూవర్మ ‘గూఢచారి’ ఆఫర్ను తిరస్కరించించింది. అడవి శేష్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించనున్న ‘గూఢచారి’లో హీరోయిన్‌గా రీతూ వర్మకి అవకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని ఆమె వదులుకుంది. నిఖిల్ సినిమా కారణంగా ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు సమాచారం.
‘స్వామి రారా’ తో ఆకట్టుకున్న నిఖిల్- సుధీర్ వర్మ కాంబినేషన్ వైపే ఆమె మొగ్గు చూపింది. అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. సెప్టెంబర్ 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. చిత్రీకరణ అంతా కాకినాడ టు విశాఖ తీరప్రాంతంలోనే జరుగుతుందని దర్శకుడు సుధీర్‌వర్మ తెలిపారు.