టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తాజాగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌తో పాటు ఓ మెలోడీ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ‘దిగు దిగు దిగు నాగ’అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా… శ్రేయ ఘోషల్ ఆలపించారు. తమన్ సంగీతం అందించారు. తెలంగాణలో చాలా పాపులర్ అయిన ఫోక్ సాంగ్ దిగు దిగు దిగు నాగ’మాదిరి, చాలా హుషారుగా సాగే పాట ఇది. 'కొంపకొచ్చిపోరో కోడెనాగ .. కొంప ముంచుతాందోయ్ ఈడు బాగా' వంటి పదప్రయోగాలు బాగున్నాయి. మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే పాట ఇది.
Comments
Please login to add a commentAdd a comment