
బీవీఎస్‌ఎన్ ప్రసాద్, అశోక్, నిత్య, రీతూ, అని ఐ.వి.శశి
అశోక్ సెల్వన్ హీరోగా, నిత్యామీనన్, రీతూవర్మ హీరోయిన్లుగా అని ఐ.వి.శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి సమర్పణలో బీవీఎస్‌ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న జీ ప్లెక్స్‌లో విడుదలవుతోంది. అని ఐ.వి.శశి మాట్లాడుతూ– ‘‘స్నేహితులందరూ కలిసి చేసిన సినిమా ఇది. సినిమా చూస్తున్నంతసేపూ చిరునవ్వుతో ఉంటారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాజర్‌గారు, నిత్యామీనన్, అశోక్ సెల్వన్‌తో నటించడం హ్యాపీ’’ అన్నారు రీతూవర్మ. ‘‘నా ‘అలా మొదలైంది’ ఎంత బాగా హిట్ అయ్యిందో ‘నిన్నిలా నిన్నిలా’ కూడా అంత బాగా హిట్ కావాలి’’ అన్నారు నిత్యామీనన్. ‘‘లవ్ అండ్ ఎమోషన్‌గా తెరకెక్కిన చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’’ అన్నారు బీవీఎస్‌ఎన్. ప్రసాద్. అశోక్ సెల్వన్, సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి, మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్ మురుగేశన్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment