రొమాంటిక్ రాకుమారుడు | Naa Rakumarudu Movie Releasing On February 21st | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ రాకుమారుడు

Published Sun, Feb 16 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

రొమాంటిక్ రాకుమారుడు

రొమాంటిక్ రాకుమారుడు

 నవీన్‌చంద్ర, రీతూవర్మ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నా రాకుమారుడు’. సత్య దర్శకుడు. వజ్రంగ్ నిర్మాత. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం టీమ్ హైదరాబాద్ ఐమ్యాక్స్ థియేటర్‌లో హంగామా చేశారు. ప్రేమకు సంబంధించి ఓ కాంటెస్ట్‌ని నిర్వహించి, విజేతలకు బహుమతులందజేశారు. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ- ‘‘సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమను మించింది ఏదీ లేదు. నిజజీవితంలో కూడా నేను నమ్మేది ఇదే. అలాంటి పాత్రనే ఈ సినిమాలో పోషించాను. ప్రేమికుల రోజున ప్రేక్షకుల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రొమాంటిక్ ప్రేమకథ ఇది. చక్కని సందేశం కూడా ఉంటుంది. నా ‘అందాలరాక్షసి’ని ఆదరించినట్లుగానే... ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నా నమ్మకం’’ అని చెప్పారు. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని రీతూవర్మ చెప్పారు. ప్రణయం, హాస్యం మేళవింపైన ఈ చిత్రం యువతరాన్ని తప్పక అలరిస్తుందని దర్శకుడు అన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement