Navincandra
-
నవ్వులు పంచే కోటీశ్వరుడు
‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్ వినగానే ఇదేదో గేమ్ షోకు సంబంధించిన సినిమా అనుకునే అవకాశం ఉంది. కథానుగుణంగా ఈ టైటిల్ పెట్టాం. మంచి సబ్జెక్ట్. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికే ఈ చిత్రం తీశా’’ అని నిర్మాత కేకే రాధామోహన్ చెప్పారు. నవీన్‌చంద్ర, శ్రుతీ శోధి, పృధ్వీ, సలోని ముఖ్య తారలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. డీజే వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని హీరో ఆది, ట్రైలర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో పృధ్వీ పాత్ర నవీన్‌చంద్ర పాత్రకు సమానంగా ఉంటుంది. సినిమా మంచి విజయం సాధించాలనే అలా చేశాం’’ అన్నారు. ‘‘నా కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుంది’’ అని నవీన్‌చంద్ర చెప్పారు. శ్రుతీసోధి, సలోని, పృధ్వీ, కెమెరామేన్ బాల్‌రెడ్డి, ఆర్ట్ డెరైక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నా లెక్క నాకుంది!
అందాల రాక్షసి అనిపించుకోవడంతో పాటు అభినయంలోనూ రాక్షసి అనిపించుకున్నారు లావణ్యా త్రిపాఠీ. గ్లామరస్ క్యారెక్టర్స్ మీద మాత్రమే ఆధారపడకుండా... నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ, దూసుకెళుతున్నారు. ఆమె నటించిన ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ ఈ నెల 29న విడుదల కానుంది. నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ జంటగా జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని ఈ చిత్రం నిర్మించారు. ఇక... లావణ్య చెప్పిన ముచ్చట్లు తెలుసుకుందాం... ♦ ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ క్రైమ్ కామెడీ మూవీ. ఇందులో నేను మల్టిపుల్ పర్సనాల్టీ డిజార్డర్ ఉన్న అమ్మాయిగా చేశా. ఈ చిత్రం ఒప్పుకోవడానికి అదో కారణం. దేవి, ఉమాదేవి, అంకాళమ్మ.. నాలో కనిపించే మూడు షేడ్స్ తాలూకు పాత్రల పేర్లివి. దేవి క్రేజీ గాళ్. చాలా ఫన్నీగా ఉంటుంది. ఉమాదేవి బిడియస్తురాలు. తన ప్రవర్తన నవ్వు తెప్పిస్తుంది. అంకాళమ్మ దేవత పాత్ర. ఈ మూడు షేడ్స్కీ శారీరక భాష, నటన పరంగా వ్యత్యాసంగా చూపించడానికి చాలా కృషి చేశాను. నాకు సవాల్‌గా అనిపించలేదు. ఎంజాయ్ చేశాను. ♦ అంకాళమ్మ పాత్రకు బరువైన చీరలు కట్టుకోవాల్సి వచ్చింది. బరువైన నగలు పెట్టుకోవాల్సి వచ్చింది. మెడలో నిమ్మ కాయల దండ, చేతిలో త్రిశూలం.. చాలా బరువైన పాత్ర అన్న మాట. ఇవన్నీ పెట్టుకుని బీభత్సంగా డ్యాన్స్ కూడా చేయాలి. హుషారుగా చేశాను. కానీ, నగల బరువుకి మెడ మీద గాట్లు పడ్డాయి. తలకి పెట్టుకున్న కిరీటం కూడా తన వంతుగా కొన్ని ఆనవాళ్లు మిగిల్చింది. నెక్, బ్యాక్ పెయిన్‌తో కొంచెం ఇబ్బందిపడ్డా. కానీ, అది కూడా ఆనందంగానే అనిపించింది. ♦ దర్శకుడు జగదీశ్ తలశిలకు చాలా అనుభవం ఉంది. మూడు షేడ్స్‌ని బాగా చేయగలిగానంటే ఆయనే కారణం. కథ ఎంత క్లియర్‌గా చెప్పారో, ఎలా నటించాలో కూడా అంతే స్పష్టంగా చెప్పారు. అందరికీ కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా తీశారు. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అవకాశం రావడం నా లక్. ♦ నా మొదటి చిత్రంలో నవీన్ చంద్రతో కలిసి నటించాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఓ తమిళ సినిమా చేశాం. ఇది మూడో సినిమా. ఇందులో మేమిద్దరం టామ్ అండ్ జెర్రీలా గొడవపడుతుంటాం. అక్కడక్కడా రొమాన్స్ ఉంటుంది. ♦ ‘లచ్చిందేవికి లెక్కుంది’ డబ్బు చుట్టూ తిరుగు తుంది. రియల్ లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా హ్యాపీగా ఉన్నాను. మామూలుగా ఉన్నప్పుడు కూడా ఆనందంగానే ఉండేదాన్ని. ఎలా ఉన్నా ఆనందంగా ఉండటం మా అమ్మానాన్న నేర్పిం చారు. డబ్బు కోసం నేనేదీ చేయను. మోడల్‌గా చేసేటప్పుడు కూడా ఏది పడితే అది చేయలేదు. సినిమాలు కూడా అంతే. ఏ సినిమా చేయాలి? ఏది చేయకూడదు? అనే విషయంలో నా లెక్క నాకుంది. ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా, కథ నచ్చక వదులుకున్న సినిమాలు ఉన్నాయి. ♦ అల్లు శిరీష్ సరసన నటిస్తున్న చిత్రం మరో రెండు నెలల్లో రిలీజ్ అవుతుంది. ఇందులో కాలేజ్ గాళ్ పాత్ర చేశాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో నాగార్జునకు తగ్గట్టు మెచ్యూర్డ్‌గా కనిపించడం కోసం కొంచెం బరువు పెరిగాను. ఆ తర్వాత కాలేజ్ గాళ్ పాత్ర కోసం తగ్గాను. మంచి క్యారెక్టర్ అనిపిస్తే ఎంత కష్టం అయినా వెనకాడను. ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడంవల్ల కొంచెం బ్రేక్ తీసుకుని, టూర్ వెళ్లాలనుకుంటున్నా. -
డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో...
‘‘వైవిధ్యమైన కథతో, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తీశాం. ఆ మధ్య మా ‘కార్తికేయ’ లానే కచ్చితంగా ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత శిరువూరి రాజేష్ అన్నారు. కార్తీక్ వర్మ దర్శకత్వంలో నవదీప్, నవీన్‌చంద్ర, పూజ హీరో హీరోయిన్లుగా వస్తున్న ‘భమ్ భోలేనాథ్ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, ‘‘చాలా విభిన్నమైన కథాంశంతో సినిమా తీశాం’’ అని చెప్పారు. ప్రచారచిత్రాలకు మంచి స్పందన వచ్చిందని హీరో నవదీప్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: రఘు పెన్మెత్స, శ్రీకాంత్ దంతులూరి. -
రొమాంటిక్ రాకుమారుడు
నవీన్‌చంద్ర, రీతూవర్మ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘నా రాకుమారుడు’. సత్య దర్శకుడు. వజ్రంగ్ నిర్మాత. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం టీమ్ హైదరాబాద్ ఐమ్యాక్స్ థియేటర్లో హంగామా చేశారు. ప్రేమకు సంబంధించి ఓ కాంటెస్ట్ని నిర్వహించి, విజేతలకు బహుమతులందజేశారు. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ- ‘‘సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమను మించింది ఏదీ లేదు. నిజజీవితంలో కూడా నేను నమ్మేది ఇదే. అలాంటి పాత్రనే ఈ సినిమాలో పోషించాను. ప్రేమికుల రోజున ప్రేక్షకుల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. రొమాంటిక్ ప్రేమకథ ఇది. చక్కని సందేశం కూడా ఉంటుంది. నా ‘అందాలరాక్షసి’ని ఆదరించినట్లుగానే... ఈ సినిమాను కూడా ఆదరిస్తారని నా నమ్మకం’’ అని చెప్పారు. ఇది అందరికీ నచ్చే సినిమా అవుతుందని రీతూవర్మ చెప్పారు. ప్రణయం, హాస్యం మేళవింపైన ఈ చిత్రం యువతరాన్ని తప్పక అలరిస్తుందని దర్శకుడు అన్నారు. -
అమ్మాయిలంటే అస్సలు పడదు
తొలి సినిమా ‘అందాల రాక్షసి’తో అందర్నీ ఆకట్టుకున్న నవీన్‌చంద్ర ప్యూర్ రొమాంటిక్ పాత్రలో నటించిన చిత్రం ‘నా రాకుమారుడు’. రీతూవర్మ కథానాయిక. సత్య దర్శకత్వంలో వజ్రంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్‌చంద్ర మాట్లాడుతూ -‘‘ఇందులో క్లాస్, మాస్‌తో కూడిన కొత్త లుక్‌లో కనిపిస్తాను. నా పాత్రకు అమ్మాయిలంటే అస్సలు పడదు. అలాంటి వాణ్ణి ఎలా ప్రేమలో పడ్డానా అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు. లవ్, రొమాన్స్, కామెడీల కలబోత ఇదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: కుమారస్వామి