నవ్వులు పంచే కోటీశ్వరుడు | me lo evaru koteeswarudu movie audio released | Sakshi
Sakshi News home page

నవ్వులు పంచే కోటీశ్వరుడు

Published Thu, Oct 20 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

నవ్వులు పంచే కోటీశ్వరుడు

నవ్వులు పంచే కోటీశ్వరుడు

‘‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్ వినగానే ఇదేదో గేమ్ షోకు సంబంధించిన సినిమా అనుకునే అవకాశం ఉంది. కథానుగుణంగా ఈ టైటిల్ పెట్టాం. మంచి సబ్జెక్ట్. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికే ఈ చిత్రం తీశా’’ అని నిర్మాత కేకే రాధామోహన్ చెప్పారు. నవీన్‌చంద్ర, శ్రుతీ శోధి, పృధ్వీ, సలోని ముఖ్య తారలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. డీజే వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని హీరో ఆది, ట్రైలర్‌ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేశారు.
 
 దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంలో పృధ్వీ పాత్ర నవీన్‌చంద్ర పాత్రకు సమానంగా ఉంటుంది. సినిమా మంచి విజయం సాధించాలనే అలా చేశాం’’ అన్నారు. ‘‘నా కెరీర్‌లో ఈ చిత్రం మరో మైలురాయిగా నిలుస్తుంది’’ అని నవీన్‌చంద్ర చెప్పారు. శ్రుతీసోధి, సలోని, పృధ్వీ, కెమెరామేన్ బాల్‌రెడ్డి, ఆర్ట్ డెరైక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement