డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో... | Navdeep's Bham Bholenath on Feb 14th | Sakshi
Sakshi News home page

డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో...

Published Tue, Feb 3 2015 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో...

డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో...

 ‘‘వైవిధ్యమైన కథతో, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తీశాం. ఆ మధ్య మా ‘కార్తికేయ’ లానే కచ్చితంగా ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత శిరువూరి రాజేష్ అన్నారు. కార్తీక్ వర్మ దర్శకత్వంలో నవదీప్, నవీన్‌చంద్ర, పూజ హీరో హీరోయిన్లుగా వస్తున్న ‘భమ్ భోలేనాథ్ ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, ‘‘చాలా విభిన్నమైన కథాంశంతో సినిమా తీశాం’’ అని చెప్పారు. ప్రచారచిత్రాలకు మంచి స్పందన వచ్చిందని హీరో నవదీప్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, సమర్పణ: రఘు పెన్మెత్స, శ్రీకాంత్ దంతులూరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement