అనుకోకుండా అవకాశం వచ్చింది
అనుకోకుండా అవకాశం వచ్చింది
Published Tue, Nov 26 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
‘హేమమాలిని, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ అంటే నాకు చాలా ఇష్టం. వారిలానే విభిన్న పాత్రలు చేసి, నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తా’’ అంటున్నారు రీతూవర్మ. ‘అనుకోకుండా’ అనే లఘుచిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారామె. త్వరలో విడుదల కానున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’ చిత్రాల్లో కథానాయికగా నటించారు ఈ బ్యూటీ. ఈ రెండు చిత్రాల్లో మంచి పాత్రలు చేశానని రీతు చెబుతూ - ‘‘ప్రేమ ఇష్క్...లో ఆధునిక యువత మనోభావాలను ప్రతిబింబించే పాత్ర చేశాను.
‘నా రాకుమారుడు’లో నేటి తరం అమ్మాయిల మనసులకు అద్దంపట్టే బబ్లీగాళ్ పాత్ర చేశాను. ఇక, నా కెరీర్ విషయానికొస్తే.. డెరైక్టర్ తరుణ్‌భాస్కర్ నాకు మంచి ఫ్రెండ్. తను అడిగిన మీదట ‘అనుకోకుండా’లో యాక్ట్ చేశాను. ఆ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. నాకు ఉత్తగా నటి అవార్డుని కూడా తెచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ సినిమా అవకాశం నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ప్రస్తుతం చేసిన రెండు చిత్రాల ద్వారా కూడా నాకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు మంచి నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా ఆశయం’’ అన్నారు.
Advertisement