Prema Ishq Kaadhal
-
ఆ దర్శకుడికి పాప పుట్టింది
హైదరాబాద్ : ' ప్రేమ ఇష్క్ కాదల్' అంటూ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సాదినేన్ పవన్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా లో షేర్ చేశాడు. తనకు పాప పుట్టిందని, తండ్రి కావడం ఒక గొప్ప అనుభూతి అంటూ తన సంతోషాన్ని ఫేస్బుక్ లో పంచుకున్నాడు. ఈ సంవత్సరం నా జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు. ఒకటి సినిమా విడుదల, రెండు నా లిటిల్ ప్రిన్సెస్ . నా పాపను ఆశీర్వదించండి అంటూ కోరాడు. ప్రేమ ఇష్క్ కాదల్ మొహబ్బత్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాదినేని మూడేళ్ల గ్యాప్ తరువాత 'సావిత్రి' సినిమాను దర్శకత్వం వహించాడు. నారా రోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు రడీ అవుతోంది. -
రాకుమారుడిలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి!
‘‘నాకు చదువు అంటే పెద్ద ఆసక్తి లేదు. అయితే అల్లరి మాత్రం చాలా బాగా చేస్తాను. నాకు రాకుమారుడులాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని ఉంది. అయ్యో... ఇదంతా నా పర్సనల్ అనుకునేరు. ‘నా రాకుమారుడు’ సినిమాలో నేను పోషించిన బిందు పాత్ర తీరు తెన్నులివి’’ అని నవ్వుతూ చెప్పారు రీతూవర్మ. నవీన్‌చంద్ర, రీతూవర్మ జంటగా సత్య దర్శకత్వంలో హరివిల్లు క్రియేషన్స్ పతాకంపై వజ్రంగ్ నిర్మించిన ‘నా రాకుమారుడు’ రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీతూవర్మ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘నేను పుట్టింది నార్త్‌లో. పెరిగింది... చదివింది హైదరాబాద్‌లో. ‘అనుకోకుండా’ అనే లఘు చిత్రంలో తొలుత నటించాను. ఆ తర్వాత ‘బాద్షా’లో కాజల్ అగర్వాల్ చెల్లెలుగా యాక్ట్ చేశాను. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ‘నా రాకుమారుడు’ నాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అందుకే విడుదలయ్యే వరకూ కొత్త సినిమాలు కమిట్ కావడం లేదు. దర్శకుడు సత్య నా పాత్రను బాగా డిజైన్ చేశాడు’’ అని చెప్పారు. -
ఇది ఒక వినూత్న ప్రయత్నం!
‘‘అందరూ వినూత్న ప్రయత్నం అని అభినందిస్తున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని బెక్కెం వేణుగోపాల్ అన్నారు. హర్షవర్ధన్‌రాణే, శ్రీవిష్ణు, హరీష్, వితిక శేరు, రీతు వర్మ, శ్రీముఖి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’. పవన్ సాధినేని దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ చిత్రం విజయవంతం ప్రదర్శించబడుతోందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అందరూ ఈ సినిమాలోని చివరి 20 నిమిషాల గురించే మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. మంచి కథాబలం ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది’’ అని చెప్పారు. చెప్పాలనుకున్న పాయింట్‌ని ధైర్యంగా చెప్పడంలో దర్శకుడు సఫలుడయ్యాడని మధురా శ్రీధర్ అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
సినిమా రివ్యూ: ప్రేమ ఇష్క్ కాదల్
టాలీవుడ్లో చిన్న చిత్రాలు ఆకట్టుకుంటున్న నేపథ్యంలో పబ్లిసిటి, మీడియా ప్రమోషన్ ద్వారా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన చిత్రం ప్రేమ ఇష్క్ కాదల్. ఈ చిత్రాన్ని డి సురేష్‌బాబు సమర్పించడంతో మరింత క్రేజ్ పెంచడం, మ్యూజిక్ కూడా ఆడియెన్స్ ను చేరుకోవడం లాంటి అంశాలు ఫీల్ గుడ్ మూవీ అనేంతగా ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం విడుదలకు ముందే మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాల్లో ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం అంచనాలను చేరుకుందా అనేది ఓసారి పరిశీలిద్దాం. రణధీర్ అలియాస్ రాండీ (హర్షవర్ధన్ రాణే)-సరయు (వితికా షేరూ), రాయల్ రాజు(విష్టువర్ధన్)-సమీరా రీతూ శర్మ, అర్జున్ (హరీష్ వర్మ)-శాంతి(శ్రీముఖి) అనే మూడు జంటలకు సంబంధించిన మూడు ప్రేమ కథల చిత్రంగా ప్రేమ ఇష్క్ కాదల్ తెరకెక్కింది. ఓ కాఫీ షాప్ యజమాని అయిన ర్యాండీకి మ్యూజిక్ అంటే ప్రాణం. తన కాఫీ షాప్‌కు వచ్చే కస్టమర్లను తన పాటలతో ఆలరిస్తూ ఉంటాడు. ర్యాండీ చేత తన కాలేజిలో పాట పాడించాలనుకున్న సరయూ అతని వెంట పడుతుంది. ఆ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటారు. రాయల్ రాజు ఓ సినిమా అసిస్టెంట్ డెరైక్టర్.. అతను షూటింగ్‌కు వచ్చిన సమీరా అనే క్యాస్టూమ్ డిజైనర్‌తో కలిగిన పరిచయం ఇద్దరిని దగ్గరయ్యేలా చేస్తోంది. అర్జున్ అనే రేడియో జాకీ ఓ ప్లేబాయ్.. ఎప్పుడూ అమ్మాయిలే జీవితంగా భావించే అర్జున్ చెన్నై నుంచి వచ్చిన ఓ సాఫ్వేర్ ఇంజినీర్ శాంతిని చూసి ఇష్టపడుతాడు. ఇలా మూడు జంట మధ్య చోటు చేసుకున్న సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయి? మూడు జంటల మధ్య చోటుచేసుకున్న అపార్ధాలు, అభిప్రాయ విభేదాలు ఎలా పరిష్కరించుకున్నారు? మూడు జంటల ప్రేమ కథలకు ముగింపేమిటో తెలుసుకోవాలంటే ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో మూడు జంటలుగా నటించిన అందరూ దాదాపు కొత్తవారే అయినప్పటికి వ్యక్తిగతంగా చక్కటి ప్రతిభను కనబరిచారు. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేకూర్చారు. సంగీతకారుడిగా హర్షవర్ధన్, మాస్ ఎలిమెంట్స్ ఉన్న రాయల్ రాజులో విష్టువర్ధన్, అర్జున్ హరీష్‌లు తమ వంతు న్యాయం చేశారు. నూతన హీరోయిన్లు ముగ్గురు కూడా మెచ్యూరిటి ఉన్న స్టార్లుగా కనిపించారు. స్టార్ యాక్టర్‌గా సత్యం రాజేశ్, ఇతర కమెడియన్లు తమ మార్కును ప్రదర్శించలేకపోయారు. ఈ చిత్రానికి కెమెరా, సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రం చాలా రిచ్‌గా కనిపించడానికి కార్తీక్ ఘట్టమనేని ఫోటోగ్రఫి, శ్రవణ్ సంగీతం కీలకపాత్రను పోషించాయి. బెక్కం వేణుగోపాల్ నిర్మాణ విలువలు అప్రిషియేట్ చేసే రేంజ్లో ఉన్నాయి. కొత్త తారల ప్రతిభ, మంచి ఫోటోగ్రఫి, ఇంపైన సంగీతం లాంటి అంశాలను సానుకూలంగా మలుచుకుని చిత్రాన్ని హిట్ గా మలుచుకోవడంలో దర్శకుడు పవన్ సాదినేని తడబాటుకు గురైనట్టు కనిపించింది. తొలి భాగం చాలా నెమ్మదించడం, ప్రేక్షుకుడికి ఆసక్తిని కలిగించే అంశాలు లేక పోవడం బోర్ కొట్టించదనే చెప్పవచ్చు. ఎడిటింగ్ పరంగా కూడా క్రిస్ప్‌గా లేకపోవడం, స్క్రీన్‌ప్లే పేలవంగా ఉండటం ఈ చిత్రానికి మైనస్‌గా నిలిచాయి. నేటి యూత్‌లో ఎలాంటి ట్రెండ్ ఉందో అనే విషయాన్ని కథగా ఎంచుకోవడం బాగానే ఉంది. అయితే అలాంటి కథను యూత్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. ఇక మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కోసమే ఈ చిత్రం తీశారనే భావన కలగడం ఈ చిత్ర విజయావకాశాలపై ప్రభావం చూపడం ఖాయం. ఏది ఏమైనా రొమాంటిక్ కామెడీగా రూపొందించే క్రమంలో పూర్తి స్థాయిలో వినోదాన్ని, ఫీల్‌గుడ్ ఎలిమెంట్స్ ను మిస్ అవడం ప్రేక్షకుడ్ని నిరాశకు గురిచేసే అంశంగా చెప్పవచ్చు. మల్టిప్లెక్స్, బి, సీ గ్రేడ్ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే చిత్రం విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి. -
'ప్రేమ ఇష్క్ కాదల్' పాటలకు శేఖర్ కమ్ముల ప్రశంస
-
‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’కు పాటలే పెద్ద ఎస్సెట్
‘‘కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రానికి పాటలు పెద్ద ఎస్సెట్. ప్రత్యేకంగా ఈ ఆల్బమ్‌లోని ‘సమ్మతమే..’ పాటంటే నాకు చాలా ఇష్టం’’ అని ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ పాటలను శేఖర్ కమ్ముల ప్రశంసించారు. హర్షవర్దన్ రానే, వితిక శేరు, విష్ణువర్దన్, రీతూ వర్మ, హరీశ్, శ్రీముఖి ముఖ్య తారలుగా డి.సురేష్‌బాబు సమర్పణలో పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘మేం నిర్మించిన ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రానికి మంచి విజయాన్నిచ్చారు. అదే స్ఫూర్తితో సరికొత్త కథాంశాన్ని ఎంచుకొని ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’ నిర్మించాం. ఇప్పటికే టాప్ 10 ఆల్బమ్స్‌లో ఈ పాటలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఒక్క ఓవర్సీస్లోనే 18 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది’’ అని చెప్పారు. అందరికీ కనెక్టయ్యే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందించామని, ఇదొక కొత్త తరహా ప్రేమకథని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని. -
మూడు రకాల ప్రేమలు
ప్రేమ ఇష్క్ కాదల్... భాషలే వేరు.. కానీ దీని భావం ఒక్కటే. ప్రేమ అనే ఆ అందమైన భావనను ప్రధానాంశంగా చేసుకుని బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో లక్కీ మీడియా పతాకంపై ఈ చిత్రం రూపొందింది. పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ తతతచిత్రంలో హర్షవర్ధన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి హీరో హీరోయిన్లుగా నటించారు. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హర్షవర్ధన్ మాట్లాడుతూ -‘‘మూడు కథలతో రూపొందిన ఈ చిత్రంలో నాదో కథ. నేను రాక్‌స్టార్‌గా నటించాను. ఇదే టీమ్‌తో నేను చేసిన ‘ఇన్ఫినిటీ’ అనే షార్ట్‌ఫిల్మ్ విజయం సాధించినట్లుగానే ఈ చిత్రం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇది తనకు తొలి చిత్రం అనీ ఇందులో యువతకు కనెక్ట్ అయ్యే ప్లేబోయ్ పాత్ర చేశానని హరీష్ తెలిపారు. పల్లెటూరి నుంచి నగరానికి వచ్చే యువకుడి పాత్రను ఇందులో చేశానని విష్ణు చెప్పారు. -
అనుకోకుండా అవకాశం వచ్చింది
‘హేమమాలిని, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ అంటే నాకు చాలా ఇష్టం. వారిలానే విభిన్న పాత్రలు చేసి, నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తా’’ అంటున్నారు రీతూవర్మ. ‘అనుకోకుండా’ అనే లఘుచిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారామె. త్వరలో విడుదల కానున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘నా రాకుమారుడు’ చిత్రాల్లో కథానాయికగా నటించారు ఈ బ్యూటీ. ఈ రెండు చిత్రాల్లో మంచి పాత్రలు చేశానని రీతు చెబుతూ - ‘‘ప్రేమ ఇష్క్...లో ఆధునిక యువత మనోభావాలను ప్రతిబింబించే పాత్ర చేశాను. ‘నా రాకుమారుడు’లో నేటి తరం అమ్మాయిల మనసులకు అద్దంపట్టే బబ్లీగాళ్ పాత్ర చేశాను. ఇక, నా కెరీర్ విషయానికొస్తే.. డెరైక్టర్ తరుణ్‌భాస్కర్ నాకు మంచి ఫ్రెండ్. తను అడిగిన మీదట ‘అనుకోకుండా’లో యాక్ట్ చేశాను. ఆ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. నాకు ఉత్తగా నటి అవార్డుని కూడా తెచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ సినిమా అవకాశం నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ప్రస్తుతం చేసిన రెండు చిత్రాల ద్వారా కూడా నాకు మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవడంతోపాటు మంచి నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నదే నా ఆశయం’’ అన్నారు.