
‘మజాకా’(Mazaka)లో యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రలో నటించాడు.బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

నా పాత్రను కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి పాత్రను చేయలేదు. ఆడియన్స్‌కి కచ్చితంగా నచ్చుతుంది’అని అన్నారు రీతూ వర్మ. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘మజాకా’.

మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రీతూ వర్మ(Ritu Varma) మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ప్రసన్న ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్ గా ఉంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్ కి కథ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. నరేషన్ చాలా నచ్చింది.

ఈ సినిమా సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ ఉంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది.

రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడాలేదు'అని ఆయన చెప్పడం నాకు చాలా మెమరబుల్.

ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్ లో అందరూ ఎనర్జిటిక్ గా వుండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుంది. బాటిల్ రీల్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది

త్రినాథ్ రావు గత సినిమాల మాదిరే మజాక కూడా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉండబోతోంది. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. టీజర్ అందరికీ నచ్చింది.

సందీప్ గారు చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్షు చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ సినిమా కోసం తెలుగు క్లాసులు కూడా తీసుకుంది.

డైరెక్టర్ త్రినాధ్ రావు చాలా జోవియల్ పర్శన్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు. అందరినీ అదే ఎనర్జీతో ఉంచుతారు. టీం అంతా చాలా పాజిటివ్ గా ఉంటారు.త్రినాధ్ రావు, ప్రసన్న వెరీ గుడ్ కాంబో. ప్రసన్న గారు ప్రతి రోజు సెట్ కి వచ్చేవారు. కామిక్ టైనింగ్ లో ఆయన చాలా పర్టిక్యులర్.

నా సీనీ జర్నీ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను.

నటిగా చాలా మంచి సినిమాలు పాత్రలు చేశాను.

అందులో గుర్తు పెట్టుకునే కొన్ని పాత్రలు వుండటం ఆనందాన్ని ఇస్తుంది.

నాకు యాక్షన్ రోల్ చేయాలని ఉంది.

అలాగే కామెడీ కూడా చేయడం నాకు చాలా ఇష్టం. ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా చేయాలని ఉంది.ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీ స్టారర్ సైన్ చేశాను. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను. అది హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.