
ఇటీవల రణరంగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమాను డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా బుధవారం చెన్నైలో లాంచనంగా ప్రారంభమైంది.
ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన ‘పెళ్ళిచూపులు’ ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నాజర్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విడదీయలేని స్నేహం, ప్రేమ అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు రాయటం విశేషం. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాను 2020 వేసవిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment