రియాక్టర్ను మళ్లీ ప్రారంభించింది
టోక్యో: అణురియాక్టర్లు పేలి భారీ నష్టాన్ని చవి చూసిన జపాన్ తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేసే చర్యలు ప్రారంభించింది. గతంలో పేలిపోయిన రియాక్టర్ స్థానంలో కొత్తదానిని నిర్మించి తిరిగి అణువిద్యుత్ ఉత్పత్తిని మంగళవారం ప్రారంభించింది. 2011లో ఫుకుషిమాలోని అణురియాక్టర్లు పేలిపోయి భారీ స్థాయిలో రేడియోథార్మికత వాతావరణంలోకి విడుదల కావడంతోపాటు వేల కోట్లలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత 2013 సెప్టెంబర్ నాటికి దాదాపు అన్ని కమర్షియల్ రియాక్టర్ల వాడకాలను దాదాపుగా జపాన్ తగ్గించింది.
అయితే, గతంలో రియాక్టర్ల ప్రమాదం జరిగిన యుషు ఖగోషిమాలోని సెందాయ్ ప్లాంట్లో మాత్రం తిరిగి రియాక్టర్ను పునరుద్ధరించే పనిని ప్రారంభించింది. అది ఇప్పటికీ సిద్ధం కావడంతోపాటు ఇటీవలె ప్రారంభానికి తిరిగి అనుమతులు లభించడంతో మంగళవారం ప్రారంభించారు. మరోపక్క, గతంలో జరిగిన ప్రమాదం తెలిసి కూడా మరోసారి రియాక్టర్ ను ప్రారంభించడాన్ని నిరసిస్తూ దాదాపు 400మంది ఆందోళన కారులు సెందాయ్ ప్లాంట్ వద్ద నిరసన తెలిపారు. మంగళవారం ఏకంగా ప్రధాని కార్యాలయం వద్దకు చేరి ఆందోళన చేస్తున్నారు.