రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Published Sun, Mar 19 2017 12:07 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
హైదరాబాద్ : నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బేగంబజార్‌కు చెందిన వికాస్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement