
పోస్టర్‌ని విడుదల చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ
‘‘మిస్టర్ లోన్లీ’ చిత్రం మంచి కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విక్కీ, కియారెడ్డి, సోనాలి వర్ధమ్, లోహిత ప్రధాన పాత్రల్లో ముక్కి హరీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర లోన్లీ’.
ఎస్‌కేఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ని ఎంవీవీ సత్యనారాయణ విడుదల చేశారు. కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ– ‘‘కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని వర్గాలను ముఖ్యంగా యువతను ఆకట్టుకునే అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ఆనంద్ గారా పాల్గొన్నారు.