సాక్షి, విశాఖపట్నం: తన భార్య, కొడుకు కిడ్నాప్‌ను రాజకీయం చేయడం బాధాకరమని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రౌడీషీటర్లు హేమంత్, రాజేష్‌లు పథకం ప్రకారం కిడ్నాప్ చేశారని, హేమంత్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
‘‘నా ఐదేళ్ల కాల్‌డేటా తీసుకుని, ఎప్పుడైనా ఫోన్ చేసినా, నాకు అతని నుంచి ఫోన్ వచ్చినా చెప్పండి. నాకు అతని నుంచి ఫోన్ వచ్చినా విచారించండి. 13న ఉదయం హేమంత్‌తో పాటు కొందరు ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. నా కొడుకును హింసించి డబ్బు, ఆభరణాలు తీసుకున్నారు. మా అబ్బాయి శరత్‌తో నా భార్యను అదేరోజు పిలిపించారు..కానీ మరుసటిరోజు వెళ్లారు. శరత్‌తో ఫోన్ చేయించిన డ్రైవర్‌ను వెళ్లిపొమ్మన్నారు. నా కుమారుడు శరత్‌తో హేమంత్ భీమిలి సీఐకి ఫోన్ చేయించి.. రెండురోజులు పాటు హేమంత్ మా ఇంటి పనిలో ఉంటారని చెప్పించారు’’ అని ఎంపీ ఎంవీవీ అన్నారు.
చదవండి: చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
‘‘వ్యాపారం విషయంలో ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రశాంతంగా వుండే విశాఖలో ఇలాంటివి జరగడం బాధాకరం. రఘు రామకృష్ణం రాజు అనే వ్యక్తి కుక్క తో సమానం.. ఏమి మాట్లాడుతున్నాడో తెలియదు. ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయి ఇబ్బందుల్లో ఉంటే ఆయన అలా మాట్లాడటం దారుణం. చంద్రబాబు వ్యాఖ్యలు కూడా హాస్యాస్పదం.. ఆయన పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.’’ అని ఎంవీవీ సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment