
సాక్షి, విశాఖపట్నం : స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. కింగ్ జార్జ్ ఆసుపత్రి, ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ ఎంపీకి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కరోనా వ్యాధి పట్ల అప్రమత్తత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా లాక్‌డౌన్ నియమ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో కరోనా కట్టడి కొనసాగుతోందన్నారు. (ఏపీలో మరో 80 పాజిటివ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment