సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కరోనా నియంత్రణపై ఆళ్లనాని మంగళవారం సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నియంత్రణకు అధికారుల కృషి అభినందనీయమని కొనియాడారు. కరోనా నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఇంకా కావాలని పిలుపునిచ్చారు. వైరస్నియంత్రణకు ప్రజలు సామాజిక దూరం పాటించాల్సిందేనని సూచించారు. ప్రజలకు ఎన్ని పనులు ఉన్నా ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.
కరోనా నియంత్రణకు 20 కమిటీలు నియమించామని ఆళ్లనాని చెప్పారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ప్రజలను భయాందోళనలకు గురి చేయొద్దన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్చందంగా రిపోర్ట్ చేయాలన్నారు. నిబంధనలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment