పెళ్లయిన మూడు నెలలకే కబళించిన మృత్యువు.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లయిన మూడు నెలలకే కబళించిన మృత్యువు..

Published Sat, Jun 10 2023 12:36 PM | Last Updated on Sat, Jun 10 2023 12:50 PM

- - Sakshi

మరిపెడ రూరల్‌ : లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో నవ దంపతులు అక్కడి అక్కడే మృతి చెందారు. కాగా, పెళ్లయిన మూడు నెలలకే దంపతులను లారీ రూపంలో మృత్యువు కబలించింది. దీంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరిపెడ మండల కేంద్రం పూలబజార్‌కు చెందిన అంజలి (21)కి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లగరిగెకు చెందిన తునగర్‌ నారాయణసింగ్‌ (23)కు గత మార్చి 9న వివాహం జరిగింది.

నారాయణ సింగ్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీకెండ్‌ కావడంతో దంపతులు బైక్‌పై అత్తగారింటికి వస్తుండగా మరిపెడ మండలం కోమటికుంటతండా సమీపంలో ఎదురుగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీని బైక్‌ ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు అక్కడి అక్కడే మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement