మార్కెట్‌కు 48 వేల బస్తాల మిర్చి
వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు 48 వేల మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మహాశివరాత్రి పండుగతో పాటు మార్కెట్‌కు వరుసగా 5 రోజులు సెలవు ఉన్న నేపథ్యంలో సోమవారం లక్ష బస్తాల వరకు మిర్చి వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయినా రైతులు 48 వేల వరకు అన్ని రకాల మిర్చిని అమ్మకానికి తీసుకొచ్చినట్లు యార్డు ఇన్‌చార్జ్‌లు తెలిపారు. కాగా, అంతకు ముందు ఈనెల 23న సుమారు 80వేల వరకు మిర్చి వచ్చింది. సోమవారం వచ్చిన మిర్చిలో తేజ రకం రూ.13,800 నుంచి 10,500, వండర్‌హాట్ రూ.16,600 నుంచి రూ.13,000, యూస్–341 రకం రూ.13, 600 నుంచి రూ.10, 000, దేశీ మిర్చి రూ.27,000నుంచి 20,000 వరకు ధరలు పలికాయి. కాగా, మార్కెట్‌కు మిర్చి భారీగా తరలిరావడంతో ధరలు తగ్గిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో తీసుకొస్తే అదే పరిస్థితి ఉంటుందని భావించిన రైతులు సోమవారం మార్కెట్‌కు భారీగా తీసుకురాలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment