వేసవి పనులు త్వరగా పూర్తి చేయాలి
హన్మకొండ : వేసవి ప్రణాళికలో భాగంగా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల (జిల్లాలు) ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డివిజన్లు, జిల్లాల వారీగా వేసవి ప్రణాళిక, ఇతర అంశాలపై సమీక్షించారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ వేసవి ప్రణాళికలో భాగంగా మిగిలిపోయిన ఇంటర్ లింకింగ్, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి, ఏప్రిల్ పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా జరిగేలా సంబంధిత అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ సర్వీస్‌ల మంజూరులో జాప్యం లేకుండా వేగవంతం చేయాలన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల రిపేర్లు, సరీసృపాల వల్ల షార్ట్ సర్క్యూట్ కాకుండా మోనోప్లాస్ట్‌లు పెట్టాలన్నారు. దీని ద్వారా చాలా వరకు అంతరాయాలను నివారించొవచ్చన్నారు. యూనిక్ పోల్ నంబర్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఓల్టేజీని మరింత మెరుగుపరచడానికి లైన్లలో కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, బీకంసింగ్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, నాగప్రసాద్, శ్రీనివాస్, సత్యనారాయణ, మల్లికార్జున్, కృష్ణ మోహన్, వేణు బాబు, డీఈ అనిల్‌కుమార్, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment