జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యం
● నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్‌దాస్
హన్మకొండ: యువతలో జాతీయ సమగ్రతను పెంపొందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నెహ్రూ యువ కేంద్రం రాష్ట్ర డైరెక్టర్ అన్షుమాన్ ప్రసాద్ దాస్ అన్నారు. సోమవారం హనుమకొడలోని హరిత కాకతీయ హోటల్‌లో అంతర్ రాష్ట్ర యువ మార్పిడి కార్యక్రమం–కేరళ ముగింపు కార్యక్రమం జరిగింది. అన్షుమాన్ ప్రసాద్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేరళ రాష్ట్ర యువతకు ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ యువజనుడు సామాజిక సేవా, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. అవినీతి, మూఢ నమ్మకాలను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ చితంల అన్వేశ్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీతలు మండల పరశురాములు, ఆకులపల్లి మధు, నిట్ ప్రొఫెసర్ కోలా ఆనంద్ కిశోర్ పాల్గొన్నారు.
కేయూ పీజీ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రెండు పరీక్ష కేంద్రాల్లో ముగ్గురు కాపీయింగ్ చేస్తూ పట్టుబడగా.. మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. అదేవిధంగా లా మొదటి సెమిస్టర్ పరీక్షల్లో వరంగల్‌లో రెండు పరీక్ష కేంద్రాల్లో కలిపి కాపీయింగ్ చేస్తూ.. స్క్వాడ్‌కు ఆరుగురు పట్టుబడ్డారు. వారిని మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment