Newly Married Woman Killed By Husband In Bangalore - Sakshi

ఆమె అందం చూసి అనుమానం.. వివాహితను చంపిన సైకో భర్త

Jan 17 2023 7:23 AM | Updated on Jan 17 2023 8:47 AM

Newly married woman killed by husband in Bangalore - Sakshi

సాక్షి, బెంగళూరు: అనుమానపు భర్త భార్యను హత్య చేశాడు.  నగరంలోని సుద్దగుంటపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తావరకెరెలో ఉన్న సుభాష్‌ నగరలో చోటు చేసుకుంది. హత్యకు గురైన నవ వివాహిత నాజ్‌ (22) కాగా, ఆమె భర్త నాసిర్‌ హుస్సేన్‌ పరారీలో ఉన్నాడు. గత ఆరు నెలల క్రితమే వీరికి పెళ్లయింది. బీటీఎం లేఔట్‌ పరిధిలోని మడివాళ వార్డు సుభాష్‌ నగరలో నివాసం ఉంటున్నారు.

ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే నాసిర్‌ భార్య అందాన్ని చూసి ఈర్ష్య చెందాడు. ఆమెకు ఇతరులతో సంబంధం ఉందని నిత్యం అనుమానించేవాడు. అనుమానం పెనుభూతమై ఆదివారం ఆమెను గొంతు పిసికి చంపాడు. తరువాత నాజ్‌ అన్నకు ఫోన్‌ చేసి నీ చెల్లెలు చనిపోయిందని చెప్పి పరారయ్యాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (Hyderabad: వలపు వల హనీ ట్రాప్‌తో నిలువు దోపిడీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement