
రాజాం నుంచి వెనుదిరుగుతున్న నూతన వధూవరులు
శ్రీకాకుళం :ఇటీవల వివాహాలు చేసుకున్న నూతన వధూవరులకూ కరోనా ఎఫెక్ట్ తప్పడం లేదు. హిందూ ఆచార సంప్రదాయాలు ప్రకా రం కొత్త జంటలు అత్తారింటికి, కన్నవారింటికి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో రాజాంలో కట్టుదిట్ట చర్యలను చేపడుతున్నారు. ఫలితంగా నూతన జంటలు సైతం ఎటూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బుధవారం నరసన్నపేట నుంచి పార్వతీపురం వెళ్లేందుకు రాజాం వచ్చిన నూతన వధూవరులు ఇక్కడి ఆంక్షలు కారణంగా వెనక్కు తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment