
హరిత శ్రీ
శ్రీకాకుళం, జి.సిగడాం: కడుపులో ఓ పసిప్రాణాన్ని కాపాడుతూ బయట కూడా జనాల ప్రాణాలను కాపాడేందుకు కాబోయే తల్లి నడుం బిగించింది. ఎనిమిది నెలల గర్భిణి అయినా.. కరోనా నియంత్రణ కోసం పాటు పడుతోంది. జి.సిగడాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా పనిచేస్తున్న పొన్నాడ హరితశ్రీ నిండు గర్భిణి. అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన ఈ సమయంలో కూడా ఆమె విధి నిర్వహణకే ప్రాధాన్యమిచ్చారు. ఉ దయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో పర్యటిస్తూ కరోనాపై జనాలకు అవగాహన క ల్పిస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో రోగులకు వైద్యం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment