సాక్షి, శ్రీకాకుళం: నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఇద్దరూ ఇరాక్‌కు చెందిన విద్యార్ధినులు రోడ్డుపై తిరుగుతూ శుక్రవారం పోలీసులకు చిక్కారు. వారు స్థానిక వెంకటేశ్వర కాలేజీలో ఎమ్-ఫార్మసీ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పట్టణంలోని ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని విద్యార్థినులు నివాసం ఉంటున్నట్లు తెలిసింది. కాలేజీ యాజమాన్యం కళ్లుగప్పి ఆ విద్యార్థినులు బయటకు రావడంతో స్థానిక వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. (అయినా మాట వినట్లేదే..!)
ఇక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం దేశమంతటా లాక్‌డౌన్ అమలవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనవసరంగా ఎవరూ బయటకు వచ్చినా.. వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంతేగాక ఈ మహమ్మారి ఎక్కడ ఎవరికి సోకుతుందో తెలియక ప్రజలంతా భయందోళనకు గురవుతున్న క్రమంలో ఇలా విదేశీ విద్యార్ధినులు బయటకు రావడం స్ధానికంగా కలకలం రేపుతోంది.
పోలీసుల అదుపులో విద్యార్థినులు
Published Fri, Mar 27 2020 12:45 PM | Last Updated on Fri, Mar 27 2020 1:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment