వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జెడ్పీ హైస్కూలులో జరిగిన రామాంజనేయులు వివాహ వేడుకకు ఆయన హాజరు అయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అక్కడి నుంచి వేముల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకొని ఇటీవల విద్యుత్ షాక్‌తో మృతి చెందిన రఘురాం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆనంతరం పులివెందులలోని వైఎస్‌ఆర్ ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొనున్నారు.