
సబ్బవరం(పెందుర్తి): పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల వద్ద జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో సబ్బవరానికి చెందిన నవ దంపతులు యడ్లపాటి వెంకటేష్, నవ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కారు డ్రైవర్ చంద్రశేఖర్ కూడా మరణించడం విదితమే. ఇదిలా ఉండగా.. నవ జంట మృతదేహాలు సబ్బవరం శ్రీనగర్ కాలనీలోని స్వగృహానికి శుక్రవారం చేరుకున్నాయి. వెంకటేష్ కుటుంబ సభ్యులతో పాటు గుంటూరు జిల్లా గోవాడకు చెందిన ఆళ్లపాటి నవ్య కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ కాలనీ అంతా విషాదఛాయలు అలముకున్నాయి. వెంకటేష్ తల్లి కృష్ణవేణి రోదిస్తున్న తీరు అందర్నీ కలచివేసింది. కొత్త జంట మృతదేహాలను సబ్బవరంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. (కాళ్ల పారాణి ఆరక ముందే..)
Comments
Please login to add a commentAdd a comment