
దంపతులు సందీప్, భవ్య(ఫైల్)
సాక్షి, కర్ణాటక (చెళ్లకెరె రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని నవ దంపతులు మృతి చెందిన ఘటన గరణి క్రాస్ వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు టీ.సందీప్(25), భవ్య(22)లకు ఆరు నెలల క్రితమే వివాహమైనట్లు సమాచారం. సందీప్ నగరంగెరె వాసి కాగా భార్య పుట్టినిల్లయిన హనుమంతనహళ్లికి బైక్‌పై వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. తళకు పోలీసులు మృతదేహాలను చెళ్లకెరె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రేమాయణం.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..)
Comments
Please login to add a commentAdd a comment