విషాదం: నవదంపతుల ఆత్మహత్య | Couple Commit Suicide In West Dodavari District | Sakshi
Sakshi News home page

విషాదం: నవదంపతుల ఆత్మహత్య

Published Mon, Jun 4 2018 10:58 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Couple Commit Suicide In West Dodavari District - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన విజయరాజు, ప్రియాంక (ఇన్‌సెట్‌లొ)

సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రొయ్యలగూడెం మండలం చొప్పనరామన్నగూడెంలో నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన విజయరాజు, ప్రియాంకలకు నాలుగు నెలల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో కాపురం ఎక్కడ పెట్టాలనే అంశంలో దంపతులు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య చర్చ జరిగింది. హైదారాబాద్‌లో కాపురం పెట్టాలని ప్రియాంక, చొప్పనరామన్నగూడెంలోనే ఉండాలని విజయరాజు వాదులాటకు దిగారు. అనంతరం  అర్థరాత్రి సమయంలో ప్రియాంక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. దాంతో మనస్థాపానికి గురైన విజయరాజు కూడా బలవన్మరణం చేసుకున్నాడు. దంపలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement