
సాక్షి, మొగల్తూరు(పశ్చిమ గోదావరి): మొగల్తూరులో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరి పిల్లల గొంతు నులిమి అనంతరం తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నల్లమిల్లి లక్ష్మీ ప్రసన్న(28) తన ఇద్దరి పిల్లలు రోజా లక్ష్మి (8), జ్ఞానవి(5)ల గొంతు నులిమి చంపింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment