వివాహిత బలవన్మరణం | Married Women Commits Suicide In West Godavari | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Published Fri, Jun 28 2019 9:12 AM | Last Updated on Fri, Jun 28 2019 9:13 AM

Married Women Commits Suicide In West Godavari - Sakshi

కాళ్ల మండలం జక్కరంలో రోదిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, కాళ్ల(పశ్చిమ గోదావరి) : వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన గురువారం జక్కరం గ్రామంలో చోటు చేసుకుంది. కాళ్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ సమయంలో ఇచ్చిన కట్న కానుకలతోపాటు అదనంగా కట్నం కావాలని భర్తతోపాటు అత్త, ఆడపడుచులు వేధిస్తున్నారని దీంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. జక్కరం గ్రామానికి  చెందిన చెరుకువాడ శివరామయ్యకు కృష్ణా జిల్లా గుడివాడ మండలం నాగవరప్పాడుకు చెందిన వసంతవాడ సత్యవతి (32)కి 2008లో వివాహం జరిగింది. అప్పట్లో సత్యవతి తల్లిదండ్రులు కట్నకానుకలు ఇచ్చారు. అయితే ఐదేళ్లుగా భర్త శివరామయ్యతోపాటు అత్త జయప్రద, ఆడపడుచు బిరుదుకోట పద్మజ అదనపు కట్నం తీసుకురమ్మని వేధించడంతో మనస్తాపం చెందిన సత్యవతి ఇంటిపై అంతస్తుపైన కిటికీకి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి తండ్రి వసంత రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కాళ్ల ఎస్సై వి.చంద్రశేఖర్‌ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పెదపాడులో మరో వివాహిత
పెదపాడు: వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెదపాడులో చోటుచేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలోని అప్పికట్ల  గ్రామానికి చెందిన  సాయిల నాగరాజు కుమార్తె నాగజ్యోతి (28)కి పెదపాడు గ్రామానికి చెందిన కరేటి ఆంజనేయులు కుమారుడు నాగరాజుతో 2009లో వివాహమైంది. కొంతకాలంగా అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో నాగజ్యోతి మనస్తాపానికి గురై   ఆత్మహత్యకు పాల్ప డింది. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగజ్యోతికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement