
Bride Photoshoot.. ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లి అనగానే.. అందరికీ ఫొటో షూట్స్ గుర్తుకు వస్తాయి. కాబోయే వధువరులిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కానీ, ఇక్కడ మాత్రం ఓ వధువు ఫొటో షూట్ విషయంలో వినూత్నంగా ఆలోచించింది. దీంతో, ఆమె చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ యువతి అందంగా పెళ్లికూతురుగా ముస్తాబై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఫొటో షూట్ చేయించుకుంది. కానీ, రోడ్డుపై ఉన్న వారంతా ఆమెను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే, సదరు యువతి ఫొటో షూట్.. రోడ్డుపై ఉన్న గుంతలను చూపిస్తూ తీసుకుంది. వాహనదారుల ఇబ్బందులను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కాగా, వధువు ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వధువును ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment