
ప్రతీకాత్మక చిత్రం
పాట్నా: మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన ఓ వధువుపై కానిస్టేబుల్ తుపాకీతో కాల్పులు జరిపాడు. పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ముంగేర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తారాపూర్ డయారాలోని మహేశ్‌పూర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అపూర్వ కుమారికి ఇటీవల ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి రోజు దగ్గర పడడంతో ఆమె మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అయితే ఓ వ్యక్తి రహస్యంగా ఆమెను ఫాలో అవుతూ బ్యూటీ పార్లర్‌కు చేరుకున్నాడు.
యువతి మేకప్ వేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వెనుక నుంచి ఓ వ్యక్తి పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ కుమారి భుజం నుంచి దూసుకెళ్లి ఛాతీ నుంచి బయటకు వచ్చింది. కుమారిపై కాల్పులు అనంతరం.. కానిస్టేబుల్ ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుంచి జారిపోవడంతో అతను అలా చేయలేకపోయాడు.పార్లర్ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఇదంతా బ్యూటీపార్లర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
గాయపడిన యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమెదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ‘నిందితుడు పాట్నాలో పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు గుర్తించాం. అతను మహేశ్‌పూర్ గ్రామానికి చెందినవాడు, అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించాం. త్వరలో అరెస్టు చేస్తామని’ డీఎస్పీ తెలిపారు. వధువుకి, అతనికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు కాల్పులు జరిపాడు? అన్న ప్రశ్నలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని చెప్పారు.
చదవండి: ప్రేమ పెళ్లి.. భర్తకు షాకిచ్చిన స్కూల్ టీచర్ భార్య, ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్‌తో కలిసి...
Comments
Please login to add a commentAdd a comment