
కర్ణాటక: ప్రేమించిన యువకున్ని పెళ్లి చేసుకున్న వెంటనే వధువు పరీక్షకు హాజరైంది. ఈ సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. భర్మప్ప నగరకు చెందిన సత్యవతి ప్రవేట్ ఉద్యోగం చేస్తోంది, చెన్నైకి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకునితో ఆమెకు రెండేళ్ల కిందట సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమ చిగురించింది.
ఇద్దరూ తమ కుటుంబ సభ్యులను ఒప్పించి సోమవారం ఉదయం ఊళ్లోనే పెళ్ళి చేసుకున్నారు. వధువుకు బీఏ చివరి ఏడాది పరీక్ష ఉండడంతో తాళి కట్టడం పూర్తి కాగానే భర్తతో కలిసి బైక్‌పై కాలేజీకి చేరుకుని పరీక్ష రాసింది. తరువాత పెళ్లి మండపానికి చేరుకుని మిగిలిన కార్యక్రమాలను పూర్తిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment