డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తినా, ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్ అంతటా వరదలు మంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటికి రావడం లేదు. ఇలాంటి సమయంలో వరదలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేమికులు వివాహం చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు.
అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వైభవంగా వీరికి పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఏది ఏమైనా పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకోకపోవడం గ్రేట్ అని కొందరు ప్రశంసిస్తుంటే, అంత తొందరేముంది? కొన్ని రోజులు ఆగొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment