Filipino
-
చిపి చిపీ చాపా... డుబిడుబిడు
వైరల్ ట్రెండ్ క్రియేట్ కావడానికి కొలతలు, ప్రమాణాలు అంటూ ఏవీ ఉండవు. తాజా వీడియో ఇదే విషయాన్ని మళ్లీ గుర్తు తెస్తోంది. అర్థం తెలియని ఒక పదబంధం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దృష్టిని ఆకర్షించి వైరల్ ట్రెండ్‌గా మారింది. ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు’ అనే పదబంధాలను లయాత్మకంగా పలుకుతూ, ఆకట్టుకునే డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్న వీడియోలు ఇంటర్నెట్లో వెల్తువెత్తుతున్నాయి. అసలు ఈ ‘చిపి చిపీ చాపా’ ‘డుబిడుబిడు అనే వింత సౌండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయానికి వస్తే... జనవరిలో విడుదలైన ఒక ఫిలిప్పినో పాటలోని సౌండ్స్ ఇవి. ట్రెండ్‌ను ఉన్నది ఉన్నట్లు ఫాలో కాకుండా వివిధ రూపాల్లో తమదైన సృజనాత్మకతను జోడిస్తున్నారు క్రియేటర్స్. పవర్ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ నుంచి నవ్వు తెప్పించే లిప్‌సింక్ వరకు... వారి సృజనాత్మకతకు హద్దులు లేవు. టిక్‌టాక్‌లో పుట్టిన ఈ ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తరించింది. -
''అంత తొందరేంటో''? వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న ప్రేమికులు
డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తినా, ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్ అంతటా వరదలు మంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటికి రావడం లేదు. ఇలాంటి సమయంలో వరదలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేమికులు వివాహం చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు. అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వైభవంగా వీరికి పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఏది ఏమైనా పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకోకపోవడం గ్రేట్ అని కొందరు ప్రశంసిస్తుంటే, అంత తొందరేముంది? కొన్ని రోజులు ఆగొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
ఫేస్బుక్లో ఆ ఫోటో ప్రత్యేక ఆకర్షణ
కాళ్ళకు కనీసం చెప్పులు కూడ లేవు. రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ కార్డుబోర్డు బాక్సు పై కూర్చొని చాలా శ్రద్ధగా హోంవర్క్ చేసుకుంటోందా బాలిక. పక్కనే ఆమె సోదరి... ఇద్దరూ నలిగి.. మాసిపోయిన పైజమాలు ధరించి, మట్టి కొట్టుకు పోయిన ముఖాలతో కనిపించడం ఫిలిప్పీన్ కు చెందిన జేమ్స్ కో అనే ఫోటో గ్రాఫర్ ను ఆకట్టుకుంది. వెంటనే ఆ ఇద్దరు బాలికలను క్లిక్ మనిపించాడు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో కూడ పోస్ట్ చేశాడు. ఇప్పుడా ఫోటో ఫేస్ బుక్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పన్నెండు వేలకు పైగా లైక్ లు కూడ వచ్చాయి. సియెలో కంజేల్స్ తన సోదరి జెనలిన్... ఆ ఇద్దరు బాలికలూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడ తీక్షణంగా తమ తమ నోట్ ప్యాడ్స్ లో హోం వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. వారికి దూరంగా లిండా గోంజేల్స్ అనే మహిళ వీధిలో కూర్చొని ఉంది. ఆమె బహుశా వారికి తల్లి అయి ఉండొచ్చు. సియెలో తన చేతిలోని నోట్ పుస్తకంలో అక్షరాలు దిద్దుతోంది. మరొక పుస్తకంలో లెక్కలు ప్రాక్టీస్ చేస్తూ కెమెరాలకు ఫోజిచ్చింది. అయితే ఆ ఫోటోలోని వివరాలను బట్టి వారి కుటుంబ పరిస్థితులను అంచనా వేయొచ్చు. ఫోటోను చూసిన ఓ ఫేస్ బుక్ యూజర్ మాత్రం ఈ విషయంలో స్పందించాడు. ''ఆ బాలికలు ఎవరో తెలియదు. కానీ వారికి చదువుపట్ల ఉన్న శ్రద్ధనుమాత్రం ప్రశంసించాలి. వారి చదువుకు కావలసిన సహాయం స్వచ్ఛంద సంస్థలుగాని, ప్రభుత్వం గాని అందించి ఆదుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ తన కామెంట్ ను పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇటువంటి ఒక దృశ్యం ఎందరినో ఆకర్శించింది. మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కిటికీ సందుల్లోంచి వచ్చే వెలుగుల్లో చదువుకుంటున్న డానియెల్ కాబెరెరా అనే మూడోక్లాసు చదువుతున్న తొమ్మిదేళ్ళ చిన్నారి స్థితిని కూడ ఫిలిప్పీన్స్ కెమెరాలో బంధించారు. మెడికల్ స్టూడెంట్ జాయిస్ టొర్రెఫ్రాంకా తీసిన ఫొటోగ్రాఫ్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిన్నారి పరిస్థితికే కాదు... అంత చిన్న వయసులో అతడు చదువుపై చూపిస్తున్న శ్రద్ధకు అంతా ముగ్ధులయ్యారు. లక్షలకొద్దీ ఆర్థిక సాయం అందించారు. ఓ చిన్న ఫోటో అతడి జీవితంలో ఎంతో మార్పును తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరిప్పుడు ఈ బాలికలకు కూడ అటువంటి సహాయం అందాలని ఆశిద్దాం. -
ఫిలిపెన్స్లో సూపర్ మ్యాన్