Filipino Girl
-
''అంత తొందరేంటో''? వరద నీటిలోనే పెళ్లి చేసుకున్న ప్రేమికులు
డోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తినా, ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఫిలిప్పీన్స్ అంతటా వరదలు మంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు ఇళ్ల నుంచి కూడా బయటికి రావడం లేదు. ఇలాంటి సమయంలో వరదలను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రేమికులు వివాహం చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో పెళ్లిని గ్రాండ్‌గా చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తుఫాను కారణంగా వరదలు పోటెత్తడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని వాయిదా వేసుకుందామనుకున్నారు. అయితే ఏది ఏమైనా అనుకున్న సమయానికే పెళ్లి జరగాలని వధువు పట్టుబట్టడంతో వరద నీటిలోనే వైభవంగా వీరికి పెళ్లి జరిపించారు. దాదాపు అడుగు మేర నీటిలో వధువు నడుచుకొని వస్తుంటే బంధువులు స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఏది ఏమైనా పెళ్లిని పోస్ట్‌పోన్ చేసుకోకపోవడం గ్రేట్ అని కొందరు ప్రశంసిస్తుంటే, అంత తొందరేముంది? కొన్ని రోజులు ఆగొచ్చుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. -
తొమ్మిదేళ్ల చిన్నారి తలలోకి కత్తెర దిగడంతో..
ఇంట్లో చిన్నారులు ఉంటే చాలా జాగ్రత్తగా గమనిస్తుండాలి వారిని. ఎప్పటికప్పుడూ వేయికళ్లతో పర్యవేక్షించాలి. ఏమరుపాటున పదునైన వస్తువులో లేదా ప్రమాదకరమైన పరికరాలో సమీపంలో ఉంచామో ఇక అంతే. ఇక్కడ కూడా ఓ చిన్నారి విషయంలో అలానే జరిగింది. ఆ చిన్నారి తల్లిందండ్రలు కడు పేదవాళ్లు. దీంతో వారి బాధ అంత ఇంత కాదు. ఇంతకీ ఆ చిన్నారికి ఏమైందంటే.. ఈ షాకింగ్ ఘటన ఫిలప్పీన్స్‌లో చోటు చేసుకుంది. 9 ఏళ్ల పాఠశాల విద్యార్థిని నికోల్ తలలో కత్తెర దిగింది. దీంతో ఆ చిన్నారి బాధ అంతా ఇంతా కాదు. అసలేం జరిగిందంటే..ఆ చిన్నారి తన సోదరుడితో పెన్సిల్ విషయమై గొడవపడింది. దీంతో ఆ బాలుడు కోపంతో కత్తెర తీసుకుని ఆ చిన్నారి తల వెనుక దాడి చేశాడు. అది అనుకోకుండా తలలోకి బలంగా దిగింది. ఈ అనూహ్య ఘటనతో కంగుతిన్న తల్లిదండ్రులు ఆ చిన్నారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ చిన్నారికి వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. కడు పేదవాళ్లైనా ఆ తల్లిదండ్రుల ఆ ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు తట్టుకునే శక్తి లేక విలవిల్లాడింది. దీంతో ఆ చిన్నారి ఆ కత్తెరతోనే వారం పాటు ఆస్పత్రిలో గడపాల్సి వచ్చింది. ఐతే స్థానికులు అతడి పరిస్థితి చూసి.. సాయం చేసేందుకు ముందకు రావడంతో ఆ చిన్నారికి జులై 9న విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ చిన్నారి తండ్రి తమ కూతురు శస్త్ర చికిత్సకు సాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలంటూ భావోద్వేగంగా చెప్పాడు. ఆ చిన్నారి త్వరితగతిన కోలుకుంటుందని, ఆమె మెదడుకు ఎలాంటి నష్టం జరగలేదని వైద్యులు తెలిపారు. అంతేగాదు ఆ చిన్నారి తండ్రి ఇలాంటి ప్రమాదకరమైన వస్తువులు వారి సమీపంలో ఉండకుండా జాగ్రత్త పడతామని అన్నారు. (చదవండి: పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్టు చేయించింది..మళ్లీ భార్యే..) -
శవపేటిక నుంచి లేచిన పాప
-
చనిపోయింది... బ్రతికింది... అంతలోనే ...
అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో చనిపోయిన తమ మూడేళ్ల చిన్నారి బతికిందని ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఆ చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ చిన్నారి చనిపోయిందంటూ వైద్యులు వెల్లడించారు. దాంతో మృత్యు ముఖంలో నుంచి వచ్చిన తమ చన్నారి మళ్లీ కానరాని లోకాలకు తరలిపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆ ఘటన పిలిపీన్స్లో చోటు చేసుకుంది. అయితే చనిపోయిన చిన్నారి బతికిందంటూ.... ఆ చిన్నారిని తండ్రి అపురూపంగా తన చేతుల్లోకి తీసుకుంటు తీసిన వీడియో ఇప్పుడు ఫేస్ బుక్‌లో హల్చల్ చేస్తుంది. పిలిఫిన్స్లో అల్లారుముద్దుగా పెంచుకున్న మూడేళ్ల చిన్నారికి జ్వరం సోకింది. దాంతో ఆ పాపను ఆమె తల్లిదండ్రులు శుక్రవారం ఆసుపత్రికి తీసువెళ్లారు. ఆ పాప అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.00 గంటలకు మృతి చెందింది. కలల పంటగా పెంచుకున్న చిన్నారి శవంగా మారడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆదివారం ఆ చిన్నారికి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఆ క్రమంలో శవపేటికలో చిన్నారిని ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించే సమయానికి కొన్ని సెకన్ల ముందు ఆ చిన్నారి శరీరం కొద్దిగా కదిలింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు, బంధువులు గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పాపను తమ పొత్తిళ్లలోకి తీసుకున్నారు. ఆ పాపను తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాప చనిపోయిందని వైద్యులు దృవీకరించారు.