చనిపోయింది... బ్రతికింది... అంతలోనే ... | Doctors: Filipino 3-year-old is dead | Sakshi
Sakshi News home page

చనిపోయింది... బ్రతికింది... అంతలోనే ...

Published Wed, Jul 16 2014 12:26 PM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

చనిపోయింది... బ్రతికింది... అంతలోనే ...

చనిపోయింది... బ్రతికింది... అంతలోనే ...

అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో చనిపోయిన తమ మూడేళ్ల చిన్నారి బతికిందని ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఆ చిన్నారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ చిన్నారి చనిపోయిందంటూ వైద్యులు వెల్లడించారు. దాంతో మృత్యు ముఖంలో నుంచి వచ్చిన తమ చన్నారి మళ్లీ కానరాని లోకాలకు తరలిపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆ ఘటన పిలిపీన్స్లో చోటు చేసుకుంది. అయితే చనిపోయిన చిన్నారి బతికిందంటూ.... ఆ చిన్నారిని తండ్రి అపురూపంగా తన చేతుల్లోకి తీసుకుంటు తీసిన వీడియో ఇప్పుడు ఫేస్ బుక్లో హల్చల్ చేస్తుంది.

పిలిఫిన్స్లో అల్లారుముద్దుగా పెంచుకున్న మూడేళ్ల చిన్నారికి జ్వరం సోకింది. దాంతో ఆ పాపను ఆమె తల్లిదండ్రులు శుక్రవారం ఆసుపత్రికి తీసువెళ్లారు. ఆ పాప అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.00 గంటలకు మృతి చెందింది. కలల పంటగా పెంచుకున్న చిన్నారి శవంగా మారడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆదివారం ఆ చిన్నారికి అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు.

ఆ క్రమంలో శవపేటికలో చిన్నారిని ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించే సమయానికి కొన్ని సెకన్ల ముందు ఆ చిన్నారి శరీరం కొద్దిగా కదిలింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులు, బంధువులు గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే పాపను తమ పొత్తిళ్లలోకి తీసుకున్నారు. ఆ పాపను తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పాప చనిపోయిందని వైద్యులు దృవీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement