తీవ్ర జ్వరంతో బాధపడుతూ చనిపోయిన మూడేళ్ల చిన్నారి మళ్లీ బతికింది. అదీ ఆ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో... ఈ అద్భుతం పిలిఫిన్స్లో చోటు చేసుకుంది. తమ చిన్నారి మృత్యు ముఖంలో నుంచి బయటకు రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. శవపేటికలో కదులుతున్న చిన్నారిని తండ్రి అపురూపంగా తన చేతుల్లోకి తీసుకుంటు తీసిన వీడియో ఇప్పుడు ఫేస్ బుక్లో హల్చల్ చేస్తుంది.