ఒక కొత్త జంట మండపంలోనే దారుణంగా పోట్లాడుకున్నారు. ఆపడం బంధువుల తరం కాలేదు. ఎంత ఘోరంగా కొట్టుకున్నారంటే..బంధువులు సైతం ఏం చేయాలో పాలుపోక షాక్‌లో ఉండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో వరుడు వధువుకి స్వీట్లు తినిపిస్తున్నాడు. ఐతే వధువు తినడానికి ఇబ్బందిగా ఫీలవుతూ వెనక్కి వెళ్తోంది. పైగా అతని చేతిని కూడా వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తోంది. అతను ఆ ఇబ్బందిని అర్థం చేసుకోకుండా అలానే పెడుతుండటంతో విసిగిపోయిన వధువు కోపంతో చెంప మీద ఒక్కటి ఇచ్చుకుంది.
అంతే అతడు కూడా ఏ మాత్రం తగ్గకుండా మరోకటి ఇచ్చుకున్నాడు. ఇక ఇద్దరు ఒకరుకొకరు తీసిపోం అన్నట్టుగా ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు. ఆపాలని బంధువులు ఎంత ప్రయ్నతించినప్పటికి వారితరం కూడా కాలేదు. అంత ఘోరంగా ఇద్దరు జుట్లు పీక్కుంటూ చిన్నపిల్లల మాదిరి కొట్టుకున్నారు. దీంతో నెటిజన్లు వారిద్దరూ అసలు కలిసి ఉండాలనకుంటున్నారా లేదా అంటూ మండిపడుతూ కామెంట్లు చేస్తు ట్వీట్ చేశారు.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022
(చదవండి: లైవ్‌లో భర్తతో గాల్లో ఫీట్లు అంతలోనే..)
Comments
Please login to add a commentAdd a comment